vaccination: రాష్ట్రాల వద్ద కోటి డోస్‌లు
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vaccination: రాష్ట్రాల వద్ద కోటి డోస్‌లు

న్యూదిల్లీ: ఒకవైపు రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు వ్యాక్సిన్‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా కోటికి పైగా వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. మరో మూడు రోజుల్లో 20లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు సరఫరా చేయనున్నట్లు వివరించింది.

వ్యాక్సిన్‌ డ్రైవ్‌ మొదలైన తర్వాత ఇప్పటి వరకూ 16.33కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ‘ఇంకా 1,00,28,527 వ్యాక్సిన్‌ డోస్‌లు రాష్ట్రాల వద్ద ఉన్నాయి. రాబోయే మూడు రోజుల్లో 19,81,110 వ్యాక్సిన్‌ డోస్‌లు అందిస్తాం’అని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ ఒకటి కాగా, భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను తయారు చేస్తోంది. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్ఫుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. మే రెండో వారంలో ఇది భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని