తిరుమల వేదపాఠశాలలో 10 మందికి కరోనా
close

తాజా వార్తలు

Updated : 15/03/2021 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల వేదపాఠశాలలో 10 మందికి కరోనా

తిరుమల: తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో మరోమారు కరోనా కలకలం సృష్టించింది. తితిదే వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా తాజాగా 10 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. పాఠశాలలో ఉంటున్న ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు తితిదే అధికారులు తెలిపారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని మెరుగైన చికిత్స కోసం పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈనెల 10న వేదపాఠశాలలో 57 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో వేదపాఠశాలలో కరోనా సోకిన వారి సంఖ్య 67కి చేరింది. ఈ వేద పాఠశాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన సుమారు 420 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని