కొవిడ్‌ లక్షణాలు మూడు రకాలు

తాజా వార్తలు

Updated : 05/04/2021 10:47 IST

కొవిడ్‌ లక్షణాలు మూడు రకాలు

వాషింగ్టన్‌: కొవిడ్‌ బాధితులను మూడు భిన్న కేటగిరీలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగుల్లోని ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, చికిత్సకు వారు స్పందించే అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. భవిష్యత్‌లో అత్యంత ఎక్కువ ముప్పు పొంచి ఉన్న బాధితులకు ప్రత్యేక చికిత్స విధానాల అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుందని  తెలిపారు. అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయశాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు.. గతేడాది మార్చి 7 నుంచి ఆగస్టు 25 మధ్యలో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 7,538 మంది రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. వీరిలో 1,022 మందికి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. బాధితుల్లో 60శాతం మందిని ఫెనోటైప్‌-2గా వర్గీకరించారు. 23శాతం మందిని ఫెనోటైప్‌-1గా గుర్తించారు. వీరికి గుండె,మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు. 16.9 శాతం మందిని ఫెనోటైప్‌-3గా గుర్తించినట్లు చెప్పారు. వారిలో చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని.. ఫెనోటైప్‌-3 బాధితుల్లో శ్వాస సంబంధ రుగ్మతలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఫెనోటైప్‌-3తో పోలిస్తే ఫెనోటైప్‌-1 వారిలో మరణం ముప్పు 7.3 రెట్లు ఎక్కువని.. ఫెనోటైప్‌-2 బాధితుల్లో అది 2.57 రెట్లు అధికమని వివరించారు. ఆయా ఫెనోటైప్‌లకు అనుగుణంగా చికిత్స విధానాలను అభివృద్ధి చేస్తే రోగులు కోలుకోవడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు.   


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని