మహారాష్ట్రలో 59వేలు దాటిన కొవిడ్‌ మరణాలు
close

తాజా వార్తలు

Published : 15/04/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో 59వేలు దాటిన కొవిడ్‌ మరణాలు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ ఉద్ధృతి మాత్రం ఏమాత్రం తగ్గకపోగా మరింతగా పెరుగుతోంది. రోజురోజుకీ మరణాలు, కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర వ్యాప్తంగా 61,695 కొత్త కేసులు, 349 మరణాలు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 2.30కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 36,39,855 మందికి మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 29,59,056 మంది కోలుకోగా.. 59,153మంది కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అక్కడ 6,20,060 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

ఒకే పడకపై ఇద్దరు రోగులు.. దిల్లీలో దయనీయం

మరోవైపు, దేశ రాజధాని నగరం దిల్లీలోనూ వైరస్‌ ఉద్ధృతి ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటికే రోగుల తాకిడితో ఆస్పత్రుల్లో పడకల్లేక, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో అవస్థలు పడుతున్న వేళ కొత్తగా భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులతో దిల్లీలో పరిస్థితులు మరింత దయనీయంగా తయారయ్యాయి. అక్కడ కొన్ని ఆస్పత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు రోగులను ఉంచి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న దృశ్యాలు దిల్లీలో ఈ వైరస్‌తో నెలకొన్న దుస్థితికి అద్దంపడుతున్నాయి. ఈ తరుణంలో గడిచిన 24గంటల వ్యవధిలో దిల్లీలో మరో 16వేలకు పైగా కొత్త కేసులు రావడం కలవరపెడుతోంది. 

దేశ రాజధాని నగరంలో గడిచిన 24గంటల్లో 82,569 శాంపిల్స్‌ పరీక్షించగా.. 16,699 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 112 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 13,014మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా గణాంకాలతో కలిపితే.. దిల్లీలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 7,84,137కి పెరిగింది. వీరిలో 7,18,176 మంది కోలుకోగా.. 11,652మంది మరణించారు. ప్రస్తుతం 54,309 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని