close

తాజా వార్తలు

Updated : 18/01/2021 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణ: రెండో రోజు టీకా పంపిణీ ఇలా..

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ టీకా పంపిణీ రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం తిరిగి టీకాల పంపిణీ చేపట్టారు. రెండోరోజు 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పారు. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 324కు పెరిగింది. రెండో రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

టీకా కేంద్రాలు అత్యధికంగా హైదరాబాద్‌లో 42 ఉండగా.. 10 కంటే ఎక్కువగా టీకా పంపిణీ కేంద్రాలున్న జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌ (13), భద్రాద్రి కొత్తగూడెం (14), ఖమ్మం (15), మహబూబ్‌నగర్‌ (11), మేడ్చల్‌ మల్కాజిగిరి (11), నల్గొండ (18), నిజామాబాద్‌ (14), రంగారెడ్డి (14), సంగారెడ్డి (12), సిద్దిపేట (12), సూర్యాపేట (10), వరంగల్‌ అర్బన్‌ (14) జిల్లాలున్నాయి.

ఇవీ చదవండి..

టీఎస్‌: 206 పాజిటివ్‌ కేసులు.. 346 రికవరీలు

కరోనా నుంచి కుదుటపడుతున్న భారత్‌!



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని