AP NEWS: రాష్ట్రానికి 3.12లక్షల కొవిడ్‌ డోసులు

తాజా వార్తలు

Published : 22/06/2021 22:09 IST

AP NEWS: రాష్ట్రానికి 3.12లక్షల కొవిడ్‌ డోసులు

అమరావతి: ఏపీకి మరో 3.12లక్షల కొవిడ్‌ టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిరిండియా విమానంలో 26 బాక్సుల్లో టీకాలు వచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను తరలించిన అధికారులు.. అక్కడి నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్‌ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్‌ కొరతకు ఉపశమనం లభించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని