close

తాజా వార్తలు

Updated : 02/12/2020 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓటు వేస్తేనే అన్ని ప్రయోజనాలు: సజ్జనార్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడంపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పందించారు. పోలింగ్‌ శాతం తగ్గడం బాధాకరమన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, అధికారులతోపాటు సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ప్రజల సొమ్ముతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.  

‘‘ఓటు వేసిన వారిని ఒక విధంగా, వేయని వారిని మరో విధంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందనిపిస్తోంది. ఓటు వేసిన వారికి పారితోషకం రూపంలో పలు ప్రయోజనాలు కల్పించి అన్ని సదుపాయాలు అందేలా ఆలోచించాలి. ఓటు వేయని వారికి ఎలాంటి ప్రయోజనాలూ అందకుండా చూడాలి. విద్యార్థులు సర్టిఫికెట్లు, అడ్మిషన్లు,  ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా వ్యత్యాసం చూపాల్సిన పరిస్థితి వచ్చిందనిపిస్తోంది. ఈ విషయంపై అధికార యంత్రాంగంతోపాటు ఎన్నికల కమిషన్‌ కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీలు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ అని సీపీ సజ్జనార్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 45.97శాతం పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే.




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని