ఈసీని సవాలు చేసే అధికారం సీఎంకు లేదు
close

తాజా వార్తలు

Published : 10/01/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసీని సవాలు చేసే అధికారం సీఎంకు లేదు

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ

నరసరావుపేట: ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించాక కాదనే హక్కు ఎవరికీ లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ వివరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు, ఎన్నికల సంఘానికి మొదట్నుంచీ విభేదాలు ఉన్నాయన్నారు. ఈసీని సవాలు చేసే అధికారం సీఎంకు లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కూడా తప్పు పట్టిందని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు. 

ఈసీతో చర్చలు జరపాలే తప్ప ఘర్షణ పడకూడదని హితవు పలికారు. ఎన్నికల సంఘానికి ఎదురు చెప్పిన ప్రభుత్వాలను ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఏపీలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ షెడ్యూలు ప్రకటించడంతో అధికార, ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలతో ఎదురుదాడి చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు మెట్లు ఎక్కింది. ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఎస్‌ఈసీని నిలువరించేలా ఆదేశించాలంటూ శనివారం వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

ఇవీ చదవండి..
వేడెక్కిన పంచాయితీ!

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: యనమల


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని