close

తాజా వార్తలు

Updated : 26/02/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా నేతల షేర్లన్నీ ఆ కంపెనీల్లోనే: చాడ

హైదరాబాద్‌: పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానిక్‌ వే బిల్‌ మొదలైన వాటికి నిరసనగా శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. అఖిలభారత వ్యాపార సమాఖ్య(సీఏఐటీ) పిలుపు మేరకు హైదరాబాద్‌లో వ్యాపారులు దుకాణాలు మూసి వేసి బంద్‌లో పాల్గొన్నారు. పలు కార్మిక సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్టు, హైదరాబాద్‌ గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌లు కూడా బంద్‌లో పాల్గొన్నట్టు ప్రకటించాయి. ఈ-వేబిల్‌ సమయం పెంచాలని, స్క్రాప్‌ పాలసీ సవరణ చేయాలని, ఏటా టోల్‌ రేట్ల పెంపుదలను నిలిపివేయాలని ఆయా సంస్థలు డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని, థర్డ్‌ పార్టీ  ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి. 

బంద్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి మఖ్దూం భవన్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్‌ పాషా, ఈటీ నరసింహా, సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. భాజపా నేతల షేర్లన్నీ అంబానీ, అదానీ కంపెనీల్లో ఉన్నాయని విమర్శించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని