close

తాజా వార్తలు

Published : 12/04/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏ రాష్ట్రంలోనూ ఎస్‌ఈసీని ఇలా తొలగించలేదు

సీఎం జగన్‌పై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అమరావతి: దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ కరోనా నివారణపై దృష్టి పెడితే.. జగన్ ప్రభుత్వం మాత్రం అధికారులను ఎలా సస్పెండ్ చేయాలనే అంశంపై దృష్టి పెట్టిందని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణనలోకి తీసుకోకపోగా, ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

‘ఏ రాష్ట్రంలోనూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఈ విధంగా తొలగించలేదు. జగన్ చెప్పినట్లుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే, రాష్ట్రం కరోనాతో కకావికలం అయ్యేది.జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషనర్‌ను మార్చినట్లుగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేపట్టాలి. మూడు రాజధానులు, ఇసుక పాలసీ, ఎన్నికల కమిషనర్ తొలగింపు, అధికారుల సస్పెన్షన్ లాంటి నిర్ణయాలతో ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. కరోనా సహాయాన్ని కూడా వైకాపా రాజకీయాలకు వాడుకుంటోంది. కరోనా విషయంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అన్నివిధాలా సహకరిస్తున్నా.. అధికార పార్టీ మాత్రం ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష, దుందుడుకు విధానాలను ఖండిస్తున్నాం’ అని రామకృష్ణ అన్నారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని