చంద్రబాబు నివాసం వద్ద వ్యక్తి సంచారం
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 08:46 IST

చంద్రబాబు నివాసం వద్ద వ్యక్తి సంచారం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను ప్రశ్నించి విడిచిపెట్టారు. ఆ వ్యక్తిని కడప జిల్లా రాజంపేట మండలం చక్రంపేట ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డి(40)గా గుర్తించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో.. తన తండ్రి, సవతి తల్లి, వారి కుమారుల నుంచి ప్రాణహాని ఉందని, ఈ విషయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రెండు రోజులుగా ఇక్కడ తిరుగుతున్నట్లు విచారణలో సుబ్బారెడ్డి చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తాము తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు ఆయన వివరాలు నమోదు చేసుకొని సొంతూరికి పంపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని