విశాఖలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి 
close

తాజా వార్తలు

Published : 07/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి 

కొత్త పాడేరు: విశాఖ జిల్లా కొత్త పాడేరులో విషాదం చోటుచేసుకుంది. పంటి నొప్పిని తట్టుకోలేక స్ఫృహతప్పి కింద పడిపోవడంతో దెబ్బలు తగిలి ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు మౌనిక (24) దిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త పాడేరు గ్రామానికి చెందిన గంగపూజారి మౌనిక(24) దిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఆమె, తన కూతురి పుట్టినరోజు వేడుక అనంతరం విధుల్లో చేరాలని భావించారు. ఈ క్రమంలో గత నెల తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె తిరిగి విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పంటి నొప్పితో దిల్లీకి వెళ్లలేకపోయారు. వారం రోజులుగా నొప్పి ఎక్కువ కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. రోజువారి పనుల్లో భాగంగా శనివారం ఉదయం దుస్తులు ఉతికేందుకు దగ్గర్లోని బావి వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంటి నొప్పి ఎక్కువ కావడంతో నడుస్తూనే స్ఫృహ కొల్పోయి హఠాత్తుగా కిందపడిపోవడంతో దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని