చేయి వేస్తే షాకిస్తామంటోన్న యువతి
close

తాజా వార్తలు

Published : 17/10/2020 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేయి వేస్తే షాకిస్తామంటోన్న యువతి

దుండగుల ఆటకట్టించే పరికరాన్ని రూపొందించిన విద్యార్థిని

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి విసుగుచెందిన ఓ విద్యార్థిని వారి భద్రతే లక్ష్యంగా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పుర్‌‌కు చెందిన పూజాపాటిల్‌ అనే విద్యార్థిని మహిళలపై దాడిచేస్తే దుండగుల నుంచి తప్పించుకునేలా కరెంట్‌ షాక్‌ ఇచ్చే కీచైన్‌ను తయారుచేసింది. ఆ పరికరం నుంచి విడుదలయ్యే విద్యుత్తుతో కేటుగాళ్ల బారినుంచి కాపాడుకోవచ్చంటోంది ఆ యువతి. థింకర్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూజా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆమె తయారుచేసిన ఈ కీచైన్‌ ఓల్టేజ్‌ ఆంప్లిఫికేషన్‌ పద్ధతిలో పనిచేస్తుంది. అందులో ఉండే బ్యాటరీ ద్వారా విద్యుత్తు సరఫరా అవుతుంది. దుండగలు ఎవరైనా మీద చేయివేస్తే వెంటనే బటన్‌ నొక్కాలి. దీంతో కీచైన్‌ నుంచి వచ్చే 440 వాట్ల విద్యుత్తు అవతలి వ్యక్తిని సృహ కోల్పోయేలా చేస్తుంది.

సోదరుడు శివ సహకారంతో ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలతోనే ఈ కీచైన్‌ను తయారుచేసినట్లు పూజా తెలిపింది. ఈ పరికరం తయారీకి కేవలం రూ.300 ఖర్చుచేసినట్లు పేర్కొంది. తాను రూపొందించిన కీచైన్‌ దేశంలోని ప్రతి మహిళకు అందాలని పూజా ఆకాంక్షిస్తోంది. థింకర్‌ ఇండియా కార్యక్రమ వ్యవస్థాపకుడు విద్యార్థిని తయారుచేసిన పరికరంపై స్పందించారు. ఈ పరికరాన్ని పూజా పేరు మీద పేటెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కీచైన్‌ మార్కెట్‌లోకి వచ్చే విధంగా యూపీ ప్రభుత్వంతోపాటు సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని