close

తాజా వార్తలు

Updated : 08/12/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిర్యానీ తిన్న 20మందికి అస్వస్థత

ఒంగోలు నగరం: నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఆహారం విషపూరితమైంది. ఆ హోటల్‌లో భోజనం చేసిన 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు బాధితుడు ఖాదర్‌షా వలీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఖాదర్‌షా  కుటుంబానికి చెందిన ఆరుగురు ఈనెల 6వ తేదీ రాత్రి సదరు హోటల్‌లో చేపలు, చికెన్‌, మటన్‌ బిర్యానీ తిన్నారు. రాత్రి 2గంటల సమయంలో వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆందోళన చెంది వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో సోమవారం సదరు హోటల్‌కు వెళ్లి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబోరేటరీకి పంపించారు. వీళ్లతో పాటు మరి కొంతమంది కూడా అదే హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. మొత్తం మీద 20మంది వరకూ హోటల్‌లో భోజనం చేశాక ఆస్పత్రి పాలైనట్లు సమాచారం అందిందని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఇదీ చదవండి..
ఏలూరులో పెరుగుతున్న అస్వస్థత కేసులు

 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని