cyber crime: కొవిడ్‌ పేరుతో రూ.23 లక్షల టోకరా 
close

తాజా వార్తలు

Published : 13/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

cyber crime: కొవిడ్‌ పేరుతో రూ.23 లక్షల టోకరా 

సైబర్‌ కేటుగాళ్ల నయా మోసం

హైదరాబాద్‌: కొవిడ్‌ ఎమర్జెన్సీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు నయా మోసానికి పాల్పడ్డారు. మెయిల్ హ్యాక్ చేసి నకిలీ ఈ మెయిల్ ద్వారా రూ.23 లక్షలు కాజేశారు. హైదరాబాద్‌కి చెందిన వీరేంద్ర బండారి అనే వ్యాపారి పేరుతో సైబర్‌ నేరగాళ్లు నకిలీ ఈ మెయిల్ క్రియేట్‌ చేశారు. తాను కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు 23.60 లక్షలు ఆన్‌లైన్‌లో పంపాలని  మెయిల్ చేశారు. వ్యాపారి ప్రమేయం లేకుండానే నకిలీ లెటర్ ప్యాడ్‌పై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌కు మెయిల్‌ చేశారు. సంతకం సరిపోవడంతో సైబర్‌ నేరగాళ్లు చెప్పిన మూడు బ్యాంక్‌ ఖాతాలకు అధికారులు రూ.23.60 లక్షల నగదును బదిలీ చేశారు. బుధవారం సాయంత్రం వీరేంద్ర బ్యాంకు ఖాతా చెక్ చేయగా డబ్బులు తక్కువ ఉన్నాయి. దీంతో సదరు వ్యాపారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని