ఇంటెలిజెన్స్‌ అధికారిణినే బురిడీ కొట్టించారు!
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటెలిజెన్స్‌ అధికారిణినే బురిడీ కొట్టించారు!

విజయవాడ నేరవార్తలు: సైబర్‌ నేరగాళ్లు రోజుకో తరహా మోసాలకు తెగబడుతున్నారు. ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసే ఓ అధికారిణినే బురిడీ కొట్టించారు. ఆమె ఖాతా నుంచి రూ.1.63 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతానికి చెందిన ఓ అధికారిణి కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఆమె ‘మేక్‌ మై ట్రిప్‌’ ద్వారా విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయాణ తేదీలను మార్చుకోవాల్సి రావటంతో ఆమె మేక్‌ మై ట్రిప్‌ కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం ఇంటర్నెట్‌లో వెతికారు. నంబర్‌
సంపాదించి ఫోన్‌ చేయగా ఆ కాల్‌ మధ్యలోనే కట్‌ అయింది. ఆ తరువాత ఆమెకు మరో నంబరు నుంచి సైబర్‌ నేరగాళ్లు వల విసిరారు. 

మేక్‌ మై ట్రిప్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని, ఏం సాయం కావాలో చెప్పాలని కోరారు. ఆమె సమస్యను మొత్తం వారికి వివరించడంతో.. మీ చరవాణికి ఓ లింక్‌ పంపిస్తామని దాని ద్వారా తేదీలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఇంతలో చరవాణికి వచ్చిన లింక్‌ను ఆమె క్లిక్‌ చేయడంతో ఆ నంబర్‌కు లింకైన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,62,999 మాయమయ్యాయి. దీనిపై ఆమె వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు వెంటనే సదరు ఖాతా నుంచి ఏ వాలెట్‌కు నగదు వెళ్లిందో గుర్తించారు. ఆ వాలెట్‌ను స్తంభింపజేసి రూ.1.5లక్షల నగదును తిరిగి బాధితురాలికి ఇప్పించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని