గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్‌
close

తాజా వార్తలు

Published : 02/03/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ కేసులో బిహార్‌, ఝార్ఖండ్‌కు చెందిన ఐదుగురితో పాటు మంచిర్యాలకు చెందిన మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 900 స్క్రాచ్‌ కార్డులు, 28 డెబిట్‌ కార్డులు, 10 ఆధార్‌కార్డులు, రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. 

వీళ్లంతా న్యాప్‌టాల్‌, షాప్‌ క్లూస్‌ నుంచి వినియోగదారుల డేటా సేకరించినట్లు గుర్తించామని సజ్జనార్‌ చెప్పారు. ఈ-కామర్స్‌ సైట్లలో కొనుగోలు చేసినందుకు గిఫ్ట్‌ వచ్చిందని.. దాన్ని తీసుకునేందుకు ఫీజు చెల్లించాలంటూ వినయోగదారులను మోసం చేసేవారన్నారు. వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించుకుని ఈ మోసాలకు పాల్పడ్డారని సీపీ వివరించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని