Horoscope : ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Published : 06/05/2021 04:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Horoscope : ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

అర్థలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనః సౌఖ్యం కలదు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ విశ్వసించకండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను జపించడం ఉత్తమం.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగండి. హనుమాన్ చాలీసా పఠించాలి.

ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండండి. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం పఠించాలి.

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల పట్ల సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శని ధ్యానం జపించడం ఉత్తమం.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి  మొదలు పెట్టాలి. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. కుటుంబ సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని