Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/10/21)

తాజా వార్తలు

Published : 17/10/2021 03:57 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/10/21)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభకాలం. ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. విద్య, వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. మీ అభివృద్ధికి బంధు,మిత్రుల సహకారం తోడవుతుంది. అధికారుల సహకారం ఉంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీధ్యానం చదివితే మంచిది.  

పనులను వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

దైవబలంతో విజయం సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో మీ కృషిని నమ్ముకుని ముందుకు సాగండి. బుద్ధిబలంతో అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రవర్తనలో అనుమానం రానీయకండి.  మీ ఇలవేల్పును ధ్యానించండి.

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా మిశ్రమ కాలం. లక్ష్మీధ్యానం వల్ల మంచి జరుగుతుంది.

పనులను ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాలను అలోచించి ముందుకు సాగాలి. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మిశ్రమకాలం. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి,ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు వెలువడుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

విజయసిద్ధి ఉంది. గమ్యం చేరే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీనివాసుని సందర్శనం శక్తిని ఇస్తుంది. 

ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతం అవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. లక్ష్మీ  అష్టోత్తరం పఠిస్తే ఇంకా మంచిది.

 

మిశ్రమకాలం. చేపట్టిన పనిలో విఘ్నాలు ఎదురవుతాయి. దుష్టులకు దూరంగా ఉండండి. అనవసర  విషయాల్లో తల దూర్చకుండా ఉండటం మంచిది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.  కీలక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకండి. శివ ధ్యానం శుభప్రదం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ వల్ల అంతా మంచి జరుగుతుంది.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది.  ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని