Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Published : 19/06/2021 03:59 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీలోని పట్టుదల మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దుర్గా దేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.   

శుభకాలం. ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు కృషి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శని ధ్యానం శుభప్రదం.

మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. గిట్టనివారితో దూరంగా ఉండటం మేలు. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.

ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించే ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మేలు. 

మొదలు పెట్టిన పని సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. జన్మస్థానంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని