close

తాజా వార్తలు

Published : 20/04/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

కొన్ని విషయాల్లో  మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం ఉంటాయి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే బాగుంటుంది.

బాగా శ్రద్ధగా  పని చేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.  కొన్ని సంఘటనల వల్ల ఉత్సాహం తగ్గుతుంది. మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. దుర్గారాధన  చేస్తే మంచిది.

మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి.  వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. శివారాధన మేలు చేస్తుంది.

ధనలాభం ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలున్నాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మిశ్రమ కాలం. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనుల్లో విజయం కోసం గోవింద నామాలు చదివితే మంచి జరుగుతుంది.

మంచి సమయం. తలపెట్టిన పనులను  విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు.  కీలక వ్యవహారాల్లో  సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధనా శుభప్రదం.

శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. సాయి బాబా చరిత్ర చదవడం మంచిది.

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్ధన మరింత మేలు చేస్తుంది.

ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని