Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (21/09/21)

తాజా వార్తలు

Published : 21/09/2021 04:03 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (21/09/21)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో  పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభప్రదం.

ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. శివ మహిమా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది.  ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు తప్పవు. అనారోగ్య  సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠనం శుభదాయకం.

చిత్తసౌఖ్యం ఉంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్పలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

చేపట్టే పనిలో ద్వంద్వ వైఖరిని  విడనాడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
 

కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

అలసట చెందకుండా చూసుకోవాలి.దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.  

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని