Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28-10-2021)

తాజా వార్తలు

Published : 28/10/2021 04:21 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28-10-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. గోసేవ చేయడం మంచిది.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా సంసిద్ధమై ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం  పఠించడం మంచిది.
 

మంచికాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడు వాటిపైకి మనస్సు మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కాలం సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభకరం.

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త  మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శనిధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

 

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మహా గణపతి ఆరాధన శుభప్రదం.

కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. ధర్మసిద్ధి ఉంది. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం. 

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు.  పనుల్లో ఆటంకాలను తొలగించుకునేందుకు శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని