అర్ధశతకాలతో రాణించిన వార్నర్‌, మనీశ్‌ 
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్ధశతకాలతో రాణించిన వార్నర్‌, మనీశ్‌ 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ లక్ష్యం 172

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆదిలోనే ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(7) విఫలమైనా.. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌(57; 55 బంతుల్లో 3x4, 2x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే(61; 46 బంతుల్లో 5x4, 1x6) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ అర్ధశతకాలతో రాణించి రెండో వికెట్‌కు 106 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఎంగిడి వేసిన 18వ ఓవర్‌లో ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. దాంతో సన్‌రైజర్స్‌ స్కోర్‌ 138/3గా నమోదైంది. అనంతరం విలియమ్సన్‌(26 నాటౌట్; 10 బంతుల్లో 4x4, 1x6), కేదార్‌ జాధవ్‌(12 నాటౌట్‌; 4 బంతుల్లో 1x4, 1x6) దంచికొట్టడంతో సన్‌రైజర్స్‌ చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు సాధించింది. దాంతో చెన్నై ముందు భారీ స్కోరునే నిర్దేశించింది. ఇక చెన్నై బౌలర్లలో ఎంగిడి రెండు, సామ్‌కరన్‌ ఒక వికెట్‌ తీశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని