David Warner: అవును.. వార్నర్‌ ‘సూపర్‌ డాడ్‌’
close

తాజా వార్తలు

Published : 22/05/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

David Warner: అవును.. వార్నర్‌ ‘సూపర్‌ డాడ్‌’

భర్త జ్ఞాపకాలు పంచుకున్న క్యాండీస్‌ వార్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కుటుంబానికి ఎంతో విలువిస్తాడు. తన భార్య క్యాండీస్‌తో పాటు ముగ్గురు కుమార్తెలను బాగా చూసుకుంటాడు. ఎప్పుడు తీరిక దొరికినా వారితో సంతోషంగా గడుపుతాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తాడు. అయితే, తాజాగా వార్నర్‌ సతీమణి క్యాండీస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి తన భర్త జ్ఞాపకాలను, అతడితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. అతడిని ‘సూపర్‌ డాడ్‌’గా పేర్కొంది.

‘వీకెండ్‌ ప్లాన్స్‌ ఏంటని అందరూ నన్ను అడుగుతుంటారు. కానీ, సూపర్‌ డాడ్‌ డేవిడ్ వార్నర్‌ ఇంట్లో ఉంటే మా రోజు ఇలా ఉంటుంది. మాకు వీకెండ్స్‌ అంటే పిల్లల సంతోషమే. అవన్నీ ఇప్పుడు మిస్‌ అవుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో వార్నర్‌ ఇంట్లో ఉండటం తలచుకుంటే సంతోషంగా ఉంది’ అని క్యాండీస్‌ పోస్టు చేసింది. దీంతోపాటు గతంలో అతడు ఇంట్లో ఉన్న సమయంలో తమ పిల్లలతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది. అందులో వార్నర్‌ బిస్కెట్లు తయారు చేస్తూ, తన కుమార్తెలతో ఆడుకుంటూ ఆనందంగా ఉన్నాడు. ఇదంతా చూసిన వార్నర్‌ వెంటనే.. ‘మీ అందర్నీ చూడకుండా ఉండలేకపోతున్నా’నంటూ బదులిచ్చాడు.

కాగా, వార్నర్‌ ఇటీవల భారత్‌లో జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆరు మ్యాచుల్లో కెప్టెన్సీ చేశాడు. అయితే, కొన్ని కారణాల వల్ల జట్టు యాజమాన్యం అతడిని కెప్టెన్‌గా తొలగించింది. విలియమ్సన్‌కు పగ్గాలు అందజేసింది. ఈ క్రమంలోనే మొత్తం ఏడు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. ఇక కరోనా కేసుల కారణంగా టోర్నీ వాయిదా పడటంతో వార్నర్‌ తిరిగి స్వదేశం చేరుకున్నాడు. అంతకుముందు భారత్‌ నుంచి నేరుగా రాకపోకలు లేకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరితో పాటే మాల్దీవులకు వెళ్లాడు. గతవారం స్వదేశానికి చేరుకున్న అతడు ప్రస్తుతం కొద్ది రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంటున్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని