close

తాజా వార్తలు

Published : 08/03/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశానికి కూడా మోదీ పేరే పెడతారేమో!

మమతాబెనర్జీ విమర్శలు

కోల్‌కతా: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. నిన్న ప్రధాని మోదీ కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నేడు దీదీ కూడా అంతే దీటుగా ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తృణమూల్‌ ప్రభుత్వంపై ప్రధాని అసత్య ప్రచారం చేస్తున్నానని దుయ్యబట్టారు. ఈ దేశానికి కూడా మోదీ పేరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఎద్దేవా చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్‌కతాలో దీదీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘భాజపా నేతలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్‌కు వస్తారు. తృణమూల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తారు. మహిళల భద్రత గురించి ఆయన(మోదీని ఉద్దేశిస్తూ) ఉపదేశాలు ఇస్తున్నారు. బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. కానీ భాజపా పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా మోదీకి ఇష్టమైన గుజరాత్‌లో మహిళల పరిస్థితి ఏంటీ? అక్కడ కనీసం ఆడవాళ్లు రాత్రిపూట స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరు. ఆదర్శరాష్ట్రంగా చెబుతున్న గుజరాత్‌లో గత రెండేళ్లుగా రోజుకు నాలుగు అత్యాచారాలు, రెండు హత్యలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందు ఆ రాష్ట్రాలపై దృష్టిపెడితే బాగుంటుంది’’అని దీదీ దుయ్యబట్టారు. 

ఈ సందర్భంగా కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రాలపై మోదీ ఫొటో ఉండటాన్ని మమత తప్పుబట్టారు. దేశానికి కూడా మోదీ పేరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదంటూ భాజపాకు చురలకంటించారు. ఈసారి బెంగాల్‌లో పోటీ దీదీ.. భాజపా మధ్యేనని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఎంసీ గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తుందని దీదీ ధీమా వ్యక్తం చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని