టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్‌ సిన్హా
close

తాజా వార్తలు

Published : 16/03/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్‌ సిన్హా

కోల్‌కతా: ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో చేరిన భాజపా సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా, జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయనను ఉపాధ్యక్షుడిగా, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వెల్లడించింది. టీఎంసీ సీనియర్‌ నేతలు సుదీప్‌ బెనర్జీ, డెరక్‌ ఒబ్రెయిన్‌ సమక్షంలో యశ్వంత్‌ రెండ్రోజుల క్రితం తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. 

వాజ్‌పేయీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన యశ్వంత్‌ సిన్హా.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ విధానాలను బహిరంగంగానే విమర్శించారు. 2018లో భాజపాకు రాజీనామా చేసిన ఆయన పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలపై కేంద్రీకృతమైన వేళ యశ్వంత్‌సిన్హా టీఎంసీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని