ఆస్పత్రి నిర్వాకం.. మృతదేహాలు తారుమారు!
close

తాజా వార్తలు

Updated : 27/09/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రి నిర్వాకం.. మృతదేహాలు తారుమారు!

2 సెకెన్లే తేడా.. లేకపోతే అంత్యక్రియలు జరిగిపోయేవి

హైదరాబాద్‌: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చికిత్సపొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందాడు. బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పడంతో మృతుడి బంధువులు రూ.10లక్షలు చెల్లించారు. అంత్యక్రియల కోసం ఒక మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని అప్పగించారు.

మృతదేహాన్ని చూపించండని బంధువులు ప్రాధేయపడినా నిబంధనలు ఒప్పుకోవని చితికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి మృతదేహం వారిది కాదని చెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. దీంతో ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి చెప్పకపోతే ఆ రెండు సెకెన్లలోనే చితికి నిప్పుపెట్టేవాళ్లమని.. రూ.10లక్షలు బిల్లు కట్టినా నిర్లక్ష్యంతో వేరే మృతదేహం అప్పగించారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని