కరోనా కాలం: అమానవీయ ఘటనలెన్నో..!
close

తాజా వార్తలు

Published : 23/07/2020 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కాలం: అమానవీయ ఘటనలెన్నో..!

రాజమహేంద్రవరం: కరోనా మహమ్మారి.. బతికున్న వారిని భయంతో వణికించి ఆస్పత్రి పాల్జేయడమే కాదు.. చనిపోయినవారిపైనా దయ చూపించనీయకుండా చేస్తోంది. మృతిచెందిన వారికి వైరస్‌ సోకినా.. సోకకపోయినా వారి దగ్గరకు వెళ్లడానికి, చివరకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సైతం ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని మృతదేహాల పట్ల, అనుమానితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి అమానవీయ ఘటనలే తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్నాయి.

మూడ్రోజులుగా ఇంటి ముందే మృతదేహం..

రాజమహేంద్రవరం శాటిలైట్‌ సిటీలో వేలాది మంది నివసించే అపార్ట్‌మెంట్లలోని ఏ-బ్లాక్‌లో 65ఏళ్ల వృద్ధుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహం నుంచి  వైద్య సిబ్బంది నామూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతడి మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌ సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు ప్రభుత్వ సిబ్బంది ప్రయత్నంచగా స్థానికులు అడ్డుపడ్డారు. దీంతో ఆ మృతదేహాన్ని ఏ బ్లాక్‌ వద్దే వదిలేశారు. మూడు రోజులుగా ఇంటివద్దే  మృతదేహం ఉండటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

రోడ్డుపైనే మృతి... పట్టించుకోని జనం

పిఠాపురంలో నాగమణి అనే ఓ మహిళ అస్వస్థతకు గురై రోడ్డుపైనే కుప్పకూలి మరణించింది. మృతదేహం కనిపించినా కరోనా భయంతో స్థానికులెవరూ పట్టించుకోలేదు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. ఎట్టకేలకు నాగమణి కుమార్తె సమాచారం తెలుసుకున్న స్థానికులు ఆమెకు విషయం చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. 

భర్తకు కరోనా అని... భార్యను గెంటేశారు

రాజమహేంద్రవరం ఆల్కట్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో ఓ మహిళ భర్తకు కరోనా సోకింది. అయితే హోం క్వారంటైన్‌లో ఉండేందుకు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను బొమ్మూరులోని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు. అనంతరం బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. అద్దె ఇంట్లోకి రావొద్దని యజమాని అడ్డుకున్నాడు. అదే కాలనీలో నిర్మాణంలో ఉన్న సొంతింటికి వెళ్లగా అక్కడ కూడా స్థానికులు అడ్డు చెప్పడంతో రాత్రంతా రోడ్డుపైనే వర్షంలో తడుస్తూ కూర్చున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని