ఈ వీడియో గేమ్‌లో మీరే డిటెక్టివ్‌!
close

తాజా వార్తలు

Published : 04/04/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ వీడియో గేమ్‌లో మీరే డిటెక్టివ్‌!

 సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్న ‘డెడ్‌ మాన్స్‌ ఫోన్‌’
 బ్రిటిష్‌ ఇండియన్‌ సీఈవో ఆలోచన

లండన్‌: వీడియో గేమ్‌ అంటే ఎప్పుడూ ఆట ఒక్కటేనా? వీటిని ఆడేవారిని ప్రధాన పాత్రలో భాగస్వామ్యం చేయలేమా? నేరాలను పసిగట్టి, వాటిని నియంత్రించే డిటెక్టివ్‌లుగా మార్చలేమా?- సరిగ్గా ఇలాగే ఆలోచించారు... బ్రిటిష్‌ ఇండియన్‌ సీఈవో నిహాల్‌ థరూర్‌! ఎలక్ట్రిక్‌ నోయిర్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు బెనడిక్ట్‌ తథమ్‌తో కలిసి ఆయన సరికొత్త వీడియో గేమ్‌ను ఆవిష్కరించారు. దీని పేరు... ‘డెడ్‌ మాన్స్‌ ఫోన్‌’. ఇదొక మర్డర్‌ మిస్టరీ గేమ్‌. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురాగా, వారం రోజుల్లోనే సుమారు 2 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు! నిజానికి గత ఏడాదిలోనే దీని బీటా వెర్షన్‌ను చాలామంది ఉపయోగించుకున్నారు. 

ఇదీ ఇతివృత్తం...

లండన్‌ కుర్రాడు జెరోమ్‌ జాకబ్‌ను బాల్కనీ నుంచి తోసేస్తారు. దీంతో అతడు కిందపడి మరణిస్తాడు. అయితే అతని చేతిలో ఓ ఫోన్‌ ఉంటుంది. ఇదీ గేమ్‌ ఇతివృత్తం. ఆటను ఆడేవారే ఈ మర్డర్‌ మిస్టరీని ఛేదించాల్సి ఉంటుంది. అడుగడుగునా తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తుండటంతో ఈ వీడియో గేమ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. గేమ్‌ ఆడే క్రమంలో- తాము ఎవరిని అరెస్టు చేశాం? అనుమానితుల లైవ్‌ లొకేషన్‌ ఏమిటి? అన్న విషయాలను తెలుసుకోవడంతో పాటు... ఈ నేరంపై ప్రజలను అప్రమత్తం చేయడం, పోలీసులతో జూమ్‌లో సంప్రదించడం వంటివీ ఉంటాయి. ఇందుకోసం గేమ్‌తో పాటు... న్యూస్, మ్యాప్, సోషల్‌మీడియా, జూమ్‌ యాప్‌లు అనుబంధంగా పనిచేస్తుంటాయి. మెట్రోపాలిటన్‌ పోలీసు డిటెక్టివ్‌లు, ఇన్వెస్టిగేటర్‌ కన్సల్టెంట్లు కూడా ఈ గేమ్‌లో ఉంటారు కాబట్టి..నిజంగానే హత్య కేసును ఛేదించినంత భావోద్వేగం ఆటగాడికి కలుగుతుందని థరూర్‌ చెప్పారు. వీడియో గేమ్స్‌లో ‘డెడ్‌ మాన్స్‌ ఫోన్‌’ ఒక సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తుందని.. ఇప్పటివరకూ వీడియో గేమ్స్‌ ఆడనివారిని సైతం ఇది ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో థరూర్, తథమ్‌లు ఓ మార్కెటింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నప్పుడే ఈ ఆలోచన వచ్చిందట. మూడేళ్ల తర్వాత కార్యరూపం దాల్చిన ఈగేమ్‌.. బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ (బీఏఎఫ్‌టీఏ) మొబైల్‌ గేమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌; లండన్‌ గేమ్స్‌ ఫెస్టివల్‌-2021కు ఎంపిక కావడం విశేషం! 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని