నార్సింగి హత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష
close

తాజా వార్తలు

Published : 10/02/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నార్సింగి హత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష

రంగారెడ్డి జిల్లా కోర్టులు‌: హైదరాబాద్‌ శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. దోషి దినేశ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..‌ నార్సింగి పరిధిలో 2017 డిసెంబర్‌ 12న ఆరేళ్ల బాలిక అపహరణకు గురైంది. బాలిక కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. స్థానికంగా ఉన్న నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక ఎవరికైనా చెబుతుందోననే భయంతో అక్కడే బండరాయితో మోది హత్య చేశాడు. కొన్ని గంటల తర్వాత నిర్మాణంలో ఉన్న ఓ భవనం సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

నిందితుడు దినేశ్‌కుమార్‌ తెలిపిన సమాచారం మేరకు సంఘటనా స్థలం నుంచి హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుడి గదిలో పలు సాంకేతిక ఆధారాలను సైతం సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు నాలుగేళ్లుగా వాదోపవాదాలు కొనసాగాయి. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి రూ.1000 జరిమానాతో పాటు ఉరి శిక్ష విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సురేశ్ మంగళవారం తీర్పు వెల్లడించారు.

ఇవీ చదవండి..

జగన్‌ ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నా: షర్మిల

జగన్‌, షర్మిల మధ్య విభేదాలు లేవు: సజ్జలTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని