దీక్షిత్‌ గొంతు నులిమి చంపేశారు: ఎస్పీ
close

తాజా వార్తలు

Updated : 22/10/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీక్షిత్‌ గొంతు నులిమి చంపేశారు: ఎస్పీ

మహబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘‘ఆదివారం సాయంత్రం 6గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన మంద సాగర్‌ అనే వ్యక్తి దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్‌ చేశాడు. కిడ్నాప్‌ చేసేందుకు ముందుగానే రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. అయినా... మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్‌ ద్విచక్రవాహనంపై దీక్షిత్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్‌గా పనిచేసే మందసాగర్‌ దీక్షిత్‌రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటాడు. కిడ్నాప్‌ చేసిన తర్వాత డబ్బు డిమాండ్‌ చేశాడు. డబ్బుల కోసమే కిడ్నాప్‌ చేసినా.. ఆ తర్వాత దొరికి పోతామనే భయంతో బాలుడి గొంతు నులిమి చంపేశాడు. కిడ్నాప్‌ చేసిన గంటన్నరకే  గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత అన్నారం శివారులోని గుట్టపైకి మృత దేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి దహనం చేశారు. చంపిన విషయం దాచిపెట్టి బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45లక్షలు డిమాండ్‌ చేశాడు. చంపిన తర్వాత కూడా రెండ్రోజుల పాటు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసింది, డబ్బు డిమాండ్‌ చేసింది, ఫోన్లలో పలుసార్లు మాట్లాడింది మంద సాగర్‌ అనే వ్యక్తి.  ఇతని స్వగ్రామం  జిల్లాలోని శనిగపురం. మహబూబాబాద్‌లోని మూడు కొట్లు సెంటర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తొందరగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ కిరాతకానికి ఒడిగట్టారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నాం. మందసాగర్‌తో పాటు మనోజ్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం. అతని పాత్రపై కూడా విచారణ జరుపుతున్నాం. నిందితులు ఇంటర్నెట్‌ కాల్స్‌ చేసినా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ టాస్క్‌ఫోర్స్‌ సాయంతో ఛేదించాం. నిందితుడి ఎన్‌కౌంటర్‌ జరగలేదు. నిందితుడికి కచ్చితంగా ఉరిశిక్ష పడేలా సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ సేకరిస్తున్నాం. ఈ కేసులో మొత్తం 24 మందిని విచారించాం’’ ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని