అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం
close

తాజా వార్తలు

Updated : 13/11/2020 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం

అయోధ్య: దీపావళికి ముందే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఏటా సరయు నదీ తీరాన దీపావళికి ఒక్కరోజు ముందు నిర్వహించే ‘దీపోత్సవ్’ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం కన్నులపండువగా నిర్వహించారు. 5 లక్షల 51వేల దీపాలను వెలిగించారు. దీంతో అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ పాల్గొన్నారు. రామ్‌మనోహర్‌ లోహియా విశ్వవిద్యాలయం, అయోధ్యలోని వివిధ కళాశాలకు చెందిన వేల మంది విద్యార్థులు ఈ దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు లేజర్‌ షోలు సైతం ఆకట్టుకుంటున్నాయి.

గతేడాది సరయు నదీ తీరాన 4 లక్షల 10 వేల మట్టి దివ్వెలను వెలిగించి యూపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. ఈ సారి ఆ రికార్డును తిరగరాసేందుకు 5.51 లక్షల దీపాలను వెలిగించాలని నిర్ణయించారు. అందులోనూ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తొలి ఏడాది కావడంతో ఈ కార్యక్రమ నిర్వహణను యోగి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన  భాజపా.. అప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని