Oxygen Shortage: ఆర్మీ సహాయం కోరిన దిల్లీ
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen Shortage: ఆర్మీ సహాయం కోరిన దిల్లీ

కేంద్ర వివరణ ఇవ్వాలన్న దిల్లీ హైకోర్టు

దిల్లీ: దేశరాజధానిలో నెలకొన్న ఆక్సిజన్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నగరంలో కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న వేళ.. ప్రత్యేక కొవిడ్‌ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్‌ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుకూ దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కేంద్ర రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. ఇదే విషయమై దిల్లీ హైకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు, దిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తిపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. పలు ఆస్పత్రులు తీవ్ర ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. గత రెండు, మూడు వారాలుగా ఈ సమస్య తీవ్రరూపం దాల్చినా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని అధిగమించలేకపోతోంది. ఈ సమయంలో రాజధానిలోని ఆసుపత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్‌ కొరత కేసులను దిల్లీ హైకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరా బాధ్యతను ఆర్మీ చేపట్టాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ప్రభుత్వం తరుపున సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా హైకోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఈ విషయంపై ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కేంద్ర రక్షణ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

ఇక ‘దిల్లీలో ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు అత్యవసర సహాయం కావాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని వనరుల వినియోగించుకొని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే దీనిపై ఆర్మీ, కేంద్రప్రభుత్వంతో పాటు ప్రైవేటు విభాగాలను విజ్ఞప్తి చేశాం’ అని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా మీడియాతో పేర్కొన్నారు. అయినప్పటికీ నగరంలో ఆసుపత్రులకు సరిపడా ఆక్సిజన్‌ అందడం లేదన్నారు.

ఇదిలాఉంటే, దేశరాజధాని దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువ కావడంతో పలుచోట్ల ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా కర్ణాటకలోనూ ఆక్సిజన్‌ కొరతతో ఒకే ఆస్పత్రిలో 24మంది రోగులు మరణించారనే వార్తలు కలవరపెడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని