close

తాజా వార్తలు

Updated : 27/01/2021 06:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రాక్టర్‌ పల్టీ వల్లే రైతు మృతి: సీసీ ఫుటేజీ!

ఫుటేజీ విడుదల చేసిన దిల్లీ పోలీసులు

దిల్లీ: దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఆందోళనల్లో ఓరైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ట్రాక్టర్‌ పల్టీ కొట్టడం వల్లే ఆ రైతు మరణించాడని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. అతివేగంగా బారికేడ్లవైపు దూసుకొచ్చిన ట్రాక్టర్‌, వాటిని ఢీకొట్టి పల్టీ కొట్టడంతోనే రైతు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు. అంతకు ముందు, రైతు మరణానికి పోలీసులే కారణమంటూ ఐటీఓ కూడలిలో రైతులు ఆందోళన చేపట్టారు. దీన్ని ఖండించిన పోలీసులు, తాజాగా వీడియోను విడుదల చేశారు.

నిబంధనల ఉల్లంఘనల వల్లే ఉద్రిక్తత..
ట్రాక్టర్‌ పరేడ్‌ చేపట్టిన రైతు సంఘాలు ముందస్తుగా అంగీకరించిన నిబంధనల్ని ఉల్లంఘించారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అనుమతించిన సమయం కన్నా ముందే ర్యాలీని ప్రారంభించడమే కాకుండా హింస, దాడులకు రైతులు కారణమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆందోళనలతో భారీ స్థాయిలో ప్రజా ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు చాలా మంది పోలీసులు గాయాల పాలయ్యారని దిల్లీ పోలీసులు తెలిపారు. ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా దిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పోలీసులు వివరించారు.

ఇవీ చదవండి..
సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయి: రైతు సంఘాలు
ఎర్రకోట వద్ద రైతన్న జెండా



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని