
తాజా వార్తలు
దిల్లీలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం 384 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో తొలిసారి అతి తక్కువ కొవిడ్-19 కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 0.76 శాతంగా నమోదైంది. 12 మంది తాజాగా కరోనా వల్ల మృత్యవాతపడ్డారు. సోమవారం 50,288 శాంపిళ్లను పరిశీలించగా.. 384 కేసులు వచ్చినట్లు దిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీలో ఇప్పటివరకు 6.27 లక్షల కరోనా కేసులు నమోదవగా.. 10,587 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు గత 11 రోజులుగా ఒక శాతం కన్నా తక్కువగా నమోదవుతోందని ఆరోగ్యశాఖ తెలిపింది.
Tags :