
తాజా వార్తలు
దేశ రాజధాని: 15 ఏళ్లలో లేనంతగా..
దిల్లీ: దట్టమైన పొగమంచు, చల్లటి గాలుల్లో దేశరాజధాని దిల్లీ చిక్కుకుపోయింది. కొత్త సంవత్సరం రోజున 15 ఏళ్లలో లేనంతగా పాదరసం స్థాయులు పడిపోయాయి. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ వద్ద అతి తక్కువగా 1.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. 2006, జనవరి 8న అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాని తర్వాత ఆ స్థాయి తగ్గుదల ఇప్పుడే కనిపించింది. గతేడాది జనవరిలో కనిష్టంగా 2.4 డిగ్రీలు ఉన్నట్లు తెలిపింది.
దట్టమైన పొగమంచు కారణంగా ఈ రోజు ఉదయం దృశ్య గోచరత(విజిబులిటీ) అత్యల్పంగా ఉందని ఐఎండీ ప్రాంతీయ విభాగాధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. వాయువ్య ప్రాంతంలో చోటుచేసుకునే వాతావరణ మార్పుల వల్ల రేపటి ఉంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించనుందని తెలిపారు. జనవరి నాలుగు నాటికి 8 డిగ్రీలకు చేరుకుంటుందన్నారు. ‘15 సంవత్సరాల కాలంలో కనిష్టంగా 1.1 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2006లో జనవరి 8న ఉష్ణోగ్రతలు 0.2 డిగ్రీలకు పడిపోయాయి. ఈ శీతల పరిస్థితులు నేడు కూడా కొనసాగుతాయి’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
కొత్త కరోనా: శాస్త్రీయ సమాచారమిదే!