నన్ను ఇరికించేందుకే కేసు పెట్టారు: దేవినేని
close

తాజా వార్తలు

Published : 23/04/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నన్ను ఇరికించేందుకే కేసు పెట్టారు: దేవినేని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేశానని తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేసిన క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ అధికారులు తనను ఇరికించేందుకే కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు అధికారిని మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధన 41 కింద ఆయనకు రక్షణ కల్పించాలని సూచించింది. ఈనెల 29న మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని దేవినేని ఉమను ధర్మాసనం  ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు దేవినేని ఉమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని