CID విచారణకు మరోసారి దేవినేని ఉమ
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CID విచారణకు మరోసారి దేవినేని ఉమ

అమరావతి: మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దేవినేని ఉమ ఈ ఉదయం మరోసారి మంగళగిరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌ అభియోగాలపై ఏప్రిల్‌ 29న 9 గంటలపాటు ఉమను సీఐడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. ‘‘సీఎం ఆనందం కోసం నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి సీఐడీ ముందుకెళ్తున్నా. రాత్రి 10 గంటల వరకు లోపల కూర్చొబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు.  

‘‘ఏపీలో జే ట్యాక్స్‌ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోంది. ధాన్యం పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే సీఎం స్పందించరు. మంత్రులు ధాన్యం దళారుల ముసుగు కప్పుకుంటే పట్టించుకోరు. ధాన్యం దోపిడీపై నాపై ఏ కేసు పెడతారో పెట్టుకోండి. రైతుల తరఫున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధం. నన్ను, ధూళిపాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 9 గంటల పాటు సీఐడీ కార్యాలయంలో కూర్చొబెడతారా?’’ అని దేవినేని ప్రశ్నించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని