
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో కార్తికమాసం సందడి
ఇంటర్నెట్‌డెస్క్: కార్తికమాసం రెండో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నదీ స్నానాలు చేసేందుకు పోటెత్తారు. దీంతో నదీతీరాలు శివనామస్మరణతో మార్మోగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి నది వద్ద వేకువజాము నుంచే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచారించి కార్తిక దీపాలను నదిలో వదిలారు. కార్తిక మాసంలో నదీస్నానం ఆచరించి కార్తిక దీపాలను వెలిగిస్తే పుణ్య ఫలం లభించడంతో పాటు స్వర్గప్రాప్తి పొందుతారని భక్తుల విశ్వాసం.
పంచారామాల్లో భక్తుల సందడి
గోదావరి తీరంలో కార్తిక శోభ విరాజిల్లుతోంది. కరోనా కారణంగా రాజమహేంద్రవరంలో గోదావరి స్నానాలు నిషేధించారు. నదిలో స్నానాలు చేయకుండా పుష్కరఘాట్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, కోనసీమలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా దివిసీమలోని పెదకళ్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి, ఘంటసాల గ్రామంలోని జలదీశ్వరస్వామి ఆలయం, మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వస్వామి ఆలయం, నడకుదురు పృథ్వీశ్వరస్వామి ఆలయంలో రెండవ కార్తిక సోమవారం పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడలో శివనామస్మరణ
కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఆ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.. స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసి భక్తులకు శీఘ్రదర్శనం కల్పించారు. మరోవైపు భక్తులు భారీగా తరలిరావడంతో వేములవాడలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
