close
Array ( ) 1

తాజా వార్తలు

అధర్మం...ఓ అగ్నిపర్వతం!

ఇస్లాం సందేశం

కచోట ఒకవ్యక్తి ధాన్యపురాశి కుప్పగా వేసి అమ్ముతున్నాడు. అటుగా వచ్చిన ముహమ్మద్‌ ప్రవక్త (స) ఆ ధాన్యపు రాశి కుప్ప లోపలికి తన చేతిని చొప్పించి చూశారు. పైన పొడిగా ఉన్న ధాన్యం లోపల తడిబారిపోయి ఉంది. ప్రజల్ని మోసగించే అతని మోసపూరిత వ్యవహారం ప్రవక్తకు తీవ్ర కోపం తెప్పించింది. ప్రవక్త (స) ఆ వ్యక్తిని తీవ్రంగా మందలించారు. వస్తువు లోపాలను ప్రజలకు చెప్పి మరీ అమ్మాలని; ఇలా మోసం చేయకూడదని చెప్పారు. ‘మోసం చేసేవారు మనలో వారు కాదు’ అని అన్నారు.

ధార్మికతలో ఇమామ్‌ అబూ హనీఫాకు మించిన వ్యక్తి ఎవరూ లేరని చెబుతారు. హనీఫా ఒకసారి తన వ్యాపార భాగస్వామి దగ్గరకు కొంత సామగ్రి పంపారు. ఇందులో ఒక వస్త్రం చిరిగిపోయి ఉంది. ఈ లోపాన్ని చెప్పి మరీ అమ్మాలని ఆయన చెప్పారు. కానీ ఆ వ్యాపారి మాత్రం ఆ లోపాన్ని చెప్పకుండానే అమ్మేశాడు. చివరికి అది ఎవరుకొన్నారనే విషయమూ మర్చిపోయాడు. ఈ సంగతి హనీఫాకు తెలిసి ఆరోజు వ్యాపారంలో వచ్చిన డబ్బంతా దానం చేసేశారు. ఆయన దైవభీతికి నిదర్శనం ఈ ఘటన. ఒకసారి హనీఫాను మంచి మనస్సు ఎలా సాధ్యమవుతుందని ఉమర్‌ బిన్‌ సాలెహ్‌ అడిగారు. దానికాయన ‘‘ధర్మ సంపాదనతోనే సాధ్యమవుతుంది’’ అని చెప్పారు.

మాలిక్‌ బిన్‌ దీనార్‌ (రహ్మ) పక్కింటి వ్యక్తి మరణశయ్యపై ఉన్నాడు. ఆ సమయంలో చావుబతుకుల మధ్య అతను ‘‘రెండు అగ్ని పర్వతాలు... రెండు అగ్ని పర్వతాలు’’ అని కలవరిస్తున్నాడు. ఈ మాటలు విని మాలిక్‌ బిన్‌ దీనార్‌ ఎందుకిలా అంటున్నావు అని ఆశ్చర్యపోతూ అడిగారు. దానికాయన ‘‘నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక పాత్రతో ఇచ్ఛి.. తీసుకునేటప్పుడు మరో పాత్రతో తీసుకునేవాడిని. ఇప్పుడవి రెండు అగ్నిపర్వతాల్లా మారి నన్ను వెంటాడుతున్నాయి’’ అని భయంతో చెప్పాడు.

- ఖైరున్నీసాబేగం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.