అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్‌.ధోనీ గుడ్‌బై!
close

తాజా వార్తలు

Updated : 16/08/2020 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్‌.ధోనీ గుడ్‌బై!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు! తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు. ‘కెరీర్‌ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.  19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియో పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తొలి, చివరి మ్యాచ్‌లు ఇలా!

మహేంద్ర సింగ్‌ ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోని పరుగులేమీ చేయకుండా రనౌట్‌ కావడం విశేషం. ఇక చివరిగా గతేడాది జులైలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ధోని ఆడాడు. ఇక టెస్టుల విషయానికొస్తే 2005లో శ్రీలంకతో ధోని తొలి టెస్టు ఆడగా,2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.

కెప్టెన్‌గా మారాడిలా..
2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టుకు తొలిసారి ధోని నాయకత్వం వహించాడు. పాకిస్థాన్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో ధోని సేన విజయం సాధించింది. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ధోని తొలిసారి కెప్టెన్‌ అయ్యాడు. 2008లో టెస్ట్‌ సిరీస్‌ నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించగా అనిల్‌ కుంబ్లే గాయపడటంతో అప్పటివరకూ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ధోని పూర్తి స్థాయి టెస్ట్‌ టీమ్‌కు నాయకుడు అయ్యాడు. ధోని నాయకత్వంలో భారత క్రికెట్‌ జట్టు 2009 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరుకుంది.

గణాంకాలు ఇవి..

ధోని క్రికెట్‌ గణాంకాల విషయానికొస్తే.. 90 టెస్టులు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా, 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10శతకాలు, 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని