close
Array ( ) 1

తాజా వార్తలు

ధోనీ ధనాధన్‌ రైడ్‌

సెలెబ్రిటీ వెహికిల్‌

మహేంద్రసింగ్‌ ధోనీ వార్తల్లోకి వచ్చాడు. సిక్సర్లు కొట్టో, సెంచరీ చేసో, రిటైర్‌మెంట్‌ ప్రకటించో కాదు.. తన కొత్త సూపర్‌బైక్‌పై రాంచీ నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ. ఆ వీడియో అంతర్జాలంలో వైరల్‌ అయిపోయింది. ఇంతకీ ఆ బైక్‌.. ఆకుపచ్చ రంగు కావాసాకీ నింజా హెచ్‌2. ధోనీలాగే ఈ బైక్‌ చాలా స్పెషల్‌. ఈ మోడల్‌ని ఇండియాలో సొంతం చేసుకున్న తొలి వ్యక్తి ధోనీనే. అత్యంత శక్తిమంతమైన ఈ మోడల్‌ మామూలు రోడ్లపై నడపడానికి అనుమతించిన అత్యంత వేగవంతమైన బైక్‌. ట్రెలిస్‌ ఫ్రేమ్‌ ఉపయోగించిన మొదటి వాహనం. 998సీసీ లిక్విడ్‌కూల్‌, 200పీఎస్‌ @ 11,000 ఆర్‌పీఎం, 113.5ఎన్‌ఎం టార్క్‌ @ 10,500 ఆర్‌పీఎం దీని ప్రత్యేకతలు. ధర రూ.35లక్షలు (ఎక్స్‌ షోరూం).


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.