Lock Downపై నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lock Downపై నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌

వాళ్లకు కొంచెం ఉపశమనం కలిగిద్దాం

హైదరాబాద్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోన్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌లు విధించిన విషయం తెలిసిందే. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండనున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరికొందరైతే లాక్‌డౌన్‌ పెట్టే అవకాశం లేదంటూ పోస్టులు చేస్తున్నారు.

కాగా, దర్శకుడు నాగ్‌అశ్విన్‌ గురువారం ఓ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు ఇంట్లోనే ఉందామని ఆయన పిలుపునిచ్చారు. ‘లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా.. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్‌ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్‌ వేయించుకుందాం. వైద్యులకు కొంత ఉపశమనం అందిద్దాం’ అని నాగ్‌అశ్విన్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని