
తాజా వార్తలు
వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు: డా.శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణలో 60ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కరోనా మహమ్మారిని నిలువరించే ప్రక్రియలో భాగంగా దాదాపు నెలన్నరగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. 60ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో దాదాపు 55లక్షల మంది ఉన్నారని చెప్పారు. మార్చి 1నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సర్వ సన్నద్ధంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ వేశాక రియాక్షన్లకు సంబంధించి ఎలాంటి అపోహలు, భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. గతంలో కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్న వారికే వ్యాక్సినేషన్ చేశామని.. మార్చి 1నుంచి అందులో స్వల్ప మార్పులు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏదైనా గుర్తింపు కార్డుతో నేరుగా దగ్గర్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చని ఆయన వివరించారు.