మమత సెక్యూరిటీ డైరెక్టర్‌పై ఈసీ వేటు
close

తాజా వార్తలు

Published : 14/03/2021 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మమత సెక్యూరిటీ డైరెక్టర్‌పై ఈసీ వేటు

కోల్‌కతా: నందిగ్రామ్‌ వ్యవహారంలో మమతా బెనర్జీ సెక్యూరిటీ డైరెక్టర్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటూ ఐపీఎస్‌ అధికారి అయిన వివేక్‌ సహాయ్‌పై చర్యలు తీసుకుంది. తక్షణమే సస్పెండ్‌ చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చింది. అభియోగాలు నమోదు చేయాలని సూచించింది. మమత కాలికి గాయమైన నేపథ్యంలో నందిగ్రామ్‌ వెళ్లి పరిశీలించిన ప్రత్యేక పరిశీలకులు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తూ ఆమె గాయాలపాలయ్యారని ఈసీకి నివేదిక సమర్పించారు. ఘటన జరిగేటప్పుడు ఆమె చుట్టూ భారీగా భద్రతా సిబ్బంది ఉన్నారని, సీఎంకు అతి సమీపంగా జనం తోసుకుంటూ వచ్చినా వారిని నియంత్రించడంలో పోలీసులు, భద్రత సిబ్బంది విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ చర్యలు చేపట్టింది.

సహాయ్‌తో పాటు పుర్బి మేదినీపూర్‌ ఎస్పీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను సైతం ఈసీ సస్పెండ్‌ చేసింది. మమతకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది. అలాగే, తూర్పు మిడ్నాపూర్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ విభు గోయల్‌ను బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధం లేని బాధ్యతలను అప్పగించింది. అలాగే పంజాబ్‌ మాజీ డీపీపీ (ఇంటిలిజెన్స్‌) అనిల్‌ కుమార్‌శర్మను పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకునిగా నియమించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని