కదల్లేని స్థితిలో.. కదిలించే చిత్రాలు
close

తాజా వార్తలు

Published : 22/03/2021 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కదల్లేని స్థితిలో.. కదిలించే చిత్రాలు

బెంగళూరు: పుట్టుకతోనే వచ్చిన వ్యాధి మంచానికే పరిమితం చేసినా.. ఆమె బెదరలేదు. కదల్లేని స్థితి ఆమె కళకు అడ్డుకాలేదు. ఆమెలో ఉన్న పట్టుదల అందమైన చిత్రాలు వేసేందుకు ఆ చేతులకు బలమిచ్చింది. ఫలితంగా వైకల్యాన్ని ఎదురించి అనుకున్నది సాధించారు కర్ణాటకకు చెందిన మీనా. అందమైన చిత్రాలు గీస్తూ, గృహోపకరణాలు తయారుచేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శివమొగ్గ జిల్లా హోసనహెళికి చెందిన మీనా పుట్టుక నుంచే కండరాలు, నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో చిన్నప్పటి నుంచే మంచానికి పరిమితమయ్యారు. అయినా చిత్రకళపై దృష్టి సారించి రాణిస్తున్నారు. 

వైకల్యానికి బెదరకుండా పదో తరగతి పూర్తిచేసిన మీనా.. వ్యాధి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చదువును ఆపేశారు. చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడమంటే ఆసక్తి ఉన్న మీనా.. చదువు మానేసిన అనంతరం చిత్రకళపై దృష్టి సారించారు. అందరూ ఆశ్చర్యపోయేలా బొమ్మలు గీస్తున్నారు. అంతేకాకుండా మిక్స్‌డ్‌ మీడియా, మీడియం డెన్సిటీ ఫైర్‌ బోర్డ్‌, సిరామిక్‌ గ్లాస్‌ టెక్నిక్‌ల ద్వారా అందమైన గృహోపకరణాలను తయారు చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. ఆమె తయారుచేస్తున్న సెల్ఫ్‌ క్రాఫ్టెడ్‌ కీ హోల్డర్స్‌, ఫొటో హోల్డర్స్‌, వాల్‌ హోల్డర్స్‌, కీ బంచ్‌ హ్యాంగర్లు, వాచ్‌ బాక్సులు, బాటిల్‌ వర్క్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. 

వైకల్యం బాధించినా సొంతంగా ఏదైనా చేయాలన్న మీనా పట్టుదలే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. కుటుంబంపై ఆధారపడకుండా ఉండాలన్న ఆమె ఆలోచనే చిన్ననాటి అభిరుచికి మెరుగులు దిద్దింది. ఏదైనా సాధించేందుకు వైకల్యం అడ్డుకాదని నిరూపించి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని