ఏపీ ఈసీ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు
close

తాజా వార్తలు

Updated : 12/01/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ ఈసీ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు

అమరావతి: ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కలిగించి పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు(జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహన్‌ను కూడా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగించారు. ఈ మేరకు కమిషన్‌ కార్యాలయంలో వాణీమోహన్‌ సేవలు అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్‌ చేశారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాణీమోహన్‌తోపాటు కార్యాలయంలో పని చేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఈ నెల 9 నుంచి సెలవులు పెట్టకుండా అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీ కోరారు. అయినప్పటికీ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయి ప్రసాద్‌ 30 రోజులపాటు సెలవుపై వెళ్తున్నట్లు లేఖ పంపడంతోపాటు ఇతర ఉద్యోగులు కూడా సెలవుపై వెళ్లేలా ఆయన ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ అంశాన్ని ఎస్‌ఈసీ  తీవ్రంగా పరిగణించింది. సాయిప్రసాద్‌ను ఆర్టికల్‌ 243కే రెడ్‌ విత్‌ 324 ప్రకారం అధికారాలు ఉపయోగించి కమిషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించడానికి ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా వీల్లేదని స్పష్టం చేశారు. కాగా, తాజాగా వాణీమోహన్‌ను కూడా రిలీవ్‌ చేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి..

అదనంగా టీకాలు ఉంచుకోవాలి: సీఎస్‌Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని