సొంతపార్టీ కార్యకర్తలపై పోలీసులకు డీఎంకే ఫిర్యాదు!
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సొంతపార్టీ కార్యకర్తలపై పోలీసులకు డీఎంకే ఫిర్యాదు!

చెన్నై: చెన్నైలో అమ్మ క్యాంటీన్‌ బోర్డులు తొలగించిన సొంత పార్టీల కార్యకర్తలపై డీఎంకే వేటువేసింది. అలాగే వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంలో కొందరు కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ  అన్నాడీఎంకే దివంగత నాయకురాలు, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న  క్యాంటీన్ల బోర్డులను తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం స్టాలిన్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డీఎంకే సీనియర్‌ నేత, చెన్నై మాజీ మేయర్‌ సుబ్రమణియన్‌ను  స్టాలిన్‌ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్న సుబ్రమణియన్‌.. వారికి పార్టీలో ఎలాంటి పదవులు లేవని తెలిపారు. అలాగే క్యాంటీన్‌ బోర్డులను తిరిగి వాటి స్థానంలో ఏర్పాటు చేశామని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని