ఆగిపోయిందనుకున్న గుండె మళ్లీ కొట్టుకుంది!
close

తాజా వార్తలు

Published : 03/03/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగిపోయిందనుకున్న గుండె మళ్లీ కొట్టుకుంది!

బెంగళూరు: మృత్యువు అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతి చెందాడని భావించి వైద్యులు పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆగిపోయిందనుకున్న అతడి గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా మహాలింగపురలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగింది. శంకర్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురికాగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహాలింగపుర ప్రభుత్వ దవాఖానాకు మార్చారు. ఆసుపత్రి వర్గాలు శంకర్‌ మృతి చెందినట్లు వెల్లడించి పోస్టుమార్టం కోసం సిద్ధమవుతుండగా అతడి కాళ్లల్లో కదలిక వచ్చింది. దీంతో బంధువులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని